ప్రణయ్ హత్య పై రామ్ షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

నల్గొండ లోని మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారింది. అమృత, ప్రణయ్ ఇద్దరు తమ ఇష్టానుసారంగా పెద్దలని కాదని పెళ్లి చేసుకున్నారు. కొంత కాలంగా ఇద్దరు ఎంతో సంతోషంగా కలిసి జీవిస్తున్నారు, అయితే వారిది కులాంతర వివాహం కావడంతో అమృత తండ్రి ఈ వివాహానికి ఒప్పుకోలేదు. అయినా కూడా వారిని ఎదిరించి వేరే కులానికి చెందిన ప్రణయ్ ని అమృత పెళ్లి చేసుకోవటంతో అమ్మాయి తండ్రి కొంత మంది కిరాయి రౌడీలతో కలిసి ప్రణయ్ ని అత్యంత కిరాతకంగా చంపించేసారు. దీని పై అన్ని వైపులా నుండి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి అమ్మాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని ప్రజలు, మానవ హక్కుల సంఘాల వారు కోరుతున్నారు. గతంలో సుప్రీం కోర్ట్ ఈ పరువు హత్యలు చేసిన వారికి ఉరిశిక్షే సరైందని తీర్పునిచ్చింది. అయితే అమృత తండ్రి మారుతీ కి ఎటువంటి శిక్ష విధిస్తారనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

ఇక తాజాగా ఈ ఉదంతం పై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన ట్విట్టర్ ద్వారా ” అసలు కోర్ట్ సెక్షన్ 377 నే బ్యాన్ చేసింది, అయినా ఇంకా ఈ క్యాస్ట్ లు, పరువు హత్యలు ఏంటి రా జంగిల్ ఫెలోస్..అసలు ముందు ఒక మనిషి గా ఉండటం నేర్చుకోండి ” అని కామెంట్ చేసారు రామ్.

Share.