అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ శైలజా రెడ్డి అల్లుడు ‘ చిత్రం వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా మొదటి షో నుండే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. రమ్య కృష్ణ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కల్లెక్షన్స్ చైతు కెరీర్ లోనే హైయెస్ట్ అని ట్రేడ్ వర్గాల సమాచారం.
శైలజా రెడ్డి అల్లుడు మొదటి రోజు 7.53 కోట్లు కలెక్ట్ చేసి చైతు స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.
ఏరియా వైజ్ కలెక్షన్స్
నైజాం : 2.5 కోట్లు
సీడెడ్ : 0.70 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.80 కోట్లు
ఈస్ట్ : 0.71 కోట్లు
వెస్ట్ : 0.40 కోట్లు
నెల్లూరు : 0.24 కోట్లు
కృష్ణా : 0.41 కోట్లు
గుంటూర్ : 0.70 కోట్లు
ఏపి/తెలంగాణా : 6.45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 0.58 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ : 7.54 కోట్లు