యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణీత దంపతులకు ఈ మధ్యనే ఒక మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. తారక్, ప్రణీతల కు ఇది రెండవ సంతానం. ఇక ఈ రోజు మధ్యాహ్నం తారక్ తన రెండవ కుమారుడికి “భార్గవ్ రామ్” అని నామకరణం చేసినట్టుగా తన అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా అభిమానులకి తెలిపారు. తారక్ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్ రామ్’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, అల్లరి పిల్లలు,ఫ్యామిలీ టైమ్ అన్న హ్యాష్‌ట్యాగ్స్ జత చేసారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ దంపతులకి అభిమానుల నుండి మరియు సినీ ఇండస్ట్రీ నుండి విషెస్ వెల్లువలా వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో ‘అరవింద సామెత వీర రాఘవ’ సినిమాలో నటిస్తున్నారు. పూజ హేగ్దే ఇందులో హీరోయిన్ గా కనిపించనున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తారు.