సుధీర్ బాబు ” నన్ను దోచుకుందువటే ” ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ టాలీవుడ్ యువ కథానాయకుడు సుధీర్ బాబు, నాభ నటేష్ జంటగా నటించిన చిత్రం ” నన్ను దోచుకుందువటే “, ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్  విడుదల చేసారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సుధీర్ బాబు సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించ బడింది. రాణి పోసాని ఈ సినిమాకి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆంజనేషు బీ లోకేష్ సంగీత దర్శకుడిగా పని చేసారు.

ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. సినిమా లో వైవ హర్ష కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సుధీర్ బాబు ఈ సినిమాలో సొంతంగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థకి యజమాని గా ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ” నన్ను దోచుకుందువటే ” సెప్టెంబర్ 21 వ తేదీన విడుదల కానుంది.

 

Share.