మరో సారి బుక్కైన అనుష్క శర్మ

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ నటి అనుష్క శర్మ పై మరో సారి నెటిజన్స్ ఫైర్ అయ్యారు, తాజాగా అనుష్క షర్మ తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఒక ఫోటో షేర్ చేసారు, ఇది గూగుల్ పిక్సెల్ 2 ఫోన్ నుండి తీసిన ఫోటో అని, చూడండి ఎంత చక్కగా వచ్చిందో అని క్యాప్షన్ జత చేసారు అనుష్క.గూగుల్ విడుదల చేసిన సరికొత్త మొబైల్ పిక్సెల్ 2 కి ఆమె ప్రచారకర్త ఉన్న విషయం తెలిసందే. కానీ ఆ ఫోటో తీసింది మాత్రం ఐ ఫోన్ నుండి, తన ట్విట్టర్ ఎకౌంట్ లో అనుష్క ఈ ఫోటో అప్ లోడ్ చేసిన వెంటనే ” ట్విట్టర్ ఫర్ ఐ ఫోన్ ” అని రావటంతో అనుష్క అడ్డంగా దొరికి పోయింది. ఇది గమనించిన పలువురు వెంటనే ఆమె పై కామెంట్స్ చేయటం ప్రారంభించారు. ఇది చాల హాస్యాస్పదంగా ఉందని కొంత మంది నవ్వుకోవటం విశేషం.

అయితే వెంటనే అనుష్క చేసిన తప్పుని తెలుసుకుని తన కొత్త గూగుల్ పిక్సెల్ 2 మొబైల్ నుండి మరల ఆ ఫోటోలని తీసి మళ్లీ అప్ లోడ్ చేసారు. అయితే ఇదే విధంగా గతంలో ఒకసారి ‘ ఏ పీ జె అబ్దుల్ కలాం ‘ గురించి ట్వీట్ చేస్తూ ఏ పీ జె కి బదులుగా ‘ ఏ బీ జె కలాం ఆజాద్ ‘ అని తప్పుగా రాసి సోషల్ మీడియా లో ప్రజల ఆగ్రహానికి గురైంది.

Share.