ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై గురువారం బీహార్ కోర్ట్ లో కేసు నమోదు చేసారు అడ్వకేట్ సుధీర్ కుమార్ ఓజా. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ లో వస్తున్న చిత్రం ‘ లవ్ రాత్రి ‘ ఈ వివాదానికి ప్రధాన కారణం. ఈ సినిమా టైటిల్ హిందూ ప్రజల మనోభావాలని కించ పరిచే విధంగా ఉందని, హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే ‘ దుర్గ దేవి నవరాత్రుల ‘ ఉత్సవాన్ని ఈ సినిమా టైటిల్ ‘ లవ్ రాత్రి ‘ కించ పరుస్తుందని వారు పిటిషన్ లో వెల్లడించారు. ఈ కేసు పై తదుపరి విచారణ మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సెప్టెంబర్ 12 వ తేదీన చేపట్టనున్నారు. అడ్వకేట్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా టైటిల్ లో దుర్గ దేవిని తక్కువ చేసి చూపిస్తున్నారని, సినిమాలో వల్గారిటీ కూడా ఎక్కువగా ఉందని చెప్పారు.
నటుడు సల్మాన్ ఖాన్ పై ఐ పీ సి సెక్షన్స్ 295 , 298 , 153 , 153 బి, 123 బి కింద బీహార్ కోర్ట్ లో కేసు నమోదు చేసారు.
తాజాగా ఇదే వివాదం పై నటుడు సల్మాన్ ఖాన్ ని ప్రశ్నించగా అయన ” కొంత మంది ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసారని, ఇది చాల మంచి టైటిల్..మేము ఎవరిని కించ పరచటానికి ఈ టైటిల్ పెట్టలేదని, ఈ సినిమా కథ నవరాత్రుల పై ఉండనుంది.. అందుకే కథకి అనుగుణంగా ‘ లవ్ రాత్రి ‘ అని పెట్టాం…ప్రేమ కంటే గొప్పది ఇంకేమి లేదు, అందుకే ఈ టైటిల్ ఫైనల్ చేసాము. మన దేశ ప్రధాని కూడా ఇదే సంప్రదాయానికి చెందిన వ్యక్తి. ఇది ఎవరి మనోభావాలు కించ పరచటానికి పెట్టింది కాదు, త్వరలో జరిగే సెన్సార్ షో లో తుది నిర్ణయం వారే తీసుకుంటారని తెలిపారు సల్మాన్ ఖాన్.