నాగ చైతన్య పై అను ఇమ్మాన్యుయేల్ షాకింగ్ కామెంట్స్, వైరల్ వీడియో

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘ శైలజ రెడ్డి అల్లుడు ‘ ఈ సినిమా ఈ నెల 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు మారుతీ ఈ సినిమాని తెరకెక్కించగా, గోపి సుందర్ స్వరాలు అందించారు. ఈ సినిమాలో అలనాటి తార రమ్య కృష్ణ నాగ చైతన్య కి అత్తా పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ మరియు పోస్టర్స్ కి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. మారుతీ గత సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా కామెడీ కి పెద్ద పీట వేశారు డైరెక్టర్ మారుతీ. ఇక కొన్ని రోజుల నుండి చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా నిన్న నాగ చైతన్య, అను కలిసి ఒక డబ్ స్మాష్ వీడియో ని విడుదల చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హాల్ చల్ చేస్తుంది. చైతు, అను మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్ రాధా కృష్ణ, నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share.