స్వలింగ సంపర్కం పై సంచలన కామెంట్స్ చేసిన కాజల్, రకుల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ రోజు భారత దేశ చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్ట్. ఇరువురి అంగీకారం తో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఐపీసీ సెక్షన్‌ 377 చట్టాన్ని సవాల్ చేస్తూ కొంత మంది వ్యక్తులు కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసుని చీఫ్‌ జస్టిస్ దీపక్‌ మిశ్ర తో కూడిన ఐదుగురు సభ్యులు విచారణ జరిపారు.
అయితే జస్టిస్ దీపక్‌ మిశ్ర మాట్లాడుతూ కేవలం స్వలింగ సంపర్కానికి మాత్రమే మేము అంగీకారం తెలిపామని, ఒకరి హక్కుని, ఇష్టాన్ని చట్ట వ్యతిరేకంగా పరిగణించటం భావ్యం కాదని ఈ తీర్పు వెల్లడించాం. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో ఇటువంటి వాటికీ వారిని బలవంత పెడితే అవి మాత్రం నేరం కింద పరిగణిస్తాం అని తెలిపారు సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్ర.

ఇక ఈ వార్త తో దేశం అంతటా సంబరాలు జరుపుకున్నారు కొంత మంది ప్రజలు. ఇక సెలబ్రిటీస్ అయినా రకుల్, శ్రియ, త్రిష, కాజల్ కూడా ఈ కేసు పై వారి స్పందన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

రకుల్ ట్వీట్ చేస్తూ ” ఇది భారత దేశ చరిత్రలోనే చారిత్రక ఘట్టం, ప్రేమే గెలిచింది. అందరికి సమన హక్కు అనేదాని పై సుప్రీం నిర్ణయం అభినందనీయం” అని ట్వీట్ చేసారు.

ఇక నటి కాజల్ ట్విట్టర్ ద్వారా ” ఎప్పుడైనా ప్రేమే గెలుస్తుంది, అందరి పట్ల సంతోషంగా ఉన్న ” అని ట్వీట్ చేసారు.

 

Share.