రామ్ చరణ్ షూటింగ్ ఫోటోలు లీక్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ కొద్దీ సేపటి క్రితమే తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ తో నటిస్తున్న చిత్రం షూటింగ్ ఫోటో ఒకటి షేర్ చేసి ” అజార్ బైజాన్ చాల మంచి ప్రదేశమని, నా తమ్ముడు రామ్ చరణ్ తో కలిసి షూటింగ్ ప్రారంభించటం చాల సంతోషం. చరణ్ కంటే గొప్పగా ఈ పాత్రని ఇంకెవరు చేయలేరు, దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఒక గొప్ప మాస్ ఎంటర్టైనర్ అని వివేక్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు”.

ఇక నిన్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ట్విట్టర్ లో రామ్ చరణ్ ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి ‘ఈ సినిమా కంప్లీట్ రా అండ్ రఫ్, ఇది ఒక మాస్ కథాంశం తో తెరకెక్కుతున్న చిత్రం అని తెలిపారు’ ఇలా నటులు అందరూ ఈ సినిమా పై ప్రశంసలు చేస్తూ, చిత్రం పై అంచనాలు పెంచుతున్నారు. ఈ చిత్రం టైటిల్ ఈ నెల 13 వ తేదీన ప్రకటించనున్నాం అని మూవీ యూనిట్ సభ్యులు ఈ రోజు వెల్లడించారు. కియారా అద్వానీ తొలి సారి రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయ్.

 

Share.