రజినీకాంత్ 22 ఏళ్ల రికార్డుని చరణ్ బ్రేక్ చేస్తాడా?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి అద్భుత దృశ్యకావ్యం ‘ బాహుబలి ‘ విడుదలైన అన్ని దేశాలలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు వారి ఘనతని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన సినిమా ‘ బాహుబలి ‘. ఈ సినిమా జపాన్ లో కూడా రిలీజ్ అయినా విషయం మనందరికీ తెలిసిందే. జపాన్ లో మన ‘ బాహుబలి ‘ సుమారు 1.2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి అక్కడ కూడా ఘన విజయాన్నినమోదు చేసింది. ఇక సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన ‘ ముత్తు ‘ సినిమా జపాన్ లో 1 . 6 డాలర్స్ కలెక్ట్ చేసి అల్ టైమ్ రికార్డు సృష్టించింది. ముత్తు సినిమా విడుదలై ఇప్పటికి 22 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఈ రికార్డు ని ఏ ఒక్క భారతీయ సినిమా బ్రేక్ చేయలేదు.

అయితే రామ్ చరణ్ నటించిన ” మగధీర ” సినిమా ఆగష్టు 30 వ తేదీన జపాన్ లో విడుదలైంది, తొలి రోజు నుండే ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తొలి 5 రోజుల్లోనే మగధీర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్య పరిచింది. ఇక ఇదే దూకుడు కొనసాగితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బాహుబలి మరియు రజినీకాంత్ ‘ ముత్తు ‘ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయటం ఖాయం. చూద్దాం రామ్ చరణ్, రజిని పేరిట ఉన్న 22 ఏళ్ల రికార్డు ని బ్రేక్ చేస్తాడో లేదో.

 

 

Share.