దిమ్మతిరిగే రేటుకు దేవదాస్ నైజాం రైట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +
అక్కినేని నాగార్జున, న్యేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీ్స్టారర్ మూవీ ‘దేవదాస్’ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. 
అలనాటి క్లాసిక్ మూవీ దేవదాస్ టైటిల్‌ను మరోసారి వాడుకుంటున్న ఈ హీరోలు ఈ సినిమాతో ఎలాంటి మాయ చేస్తారా అని 
ఆసక్తిగా చూస్తున్నారు జనాలు.

కాగా ఇదొక ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని పోస్టర్స్ చూస్తే మనకు ఇట్టే అర్ధమవుతుంది. నాగార్జున మాఫియా డాన్‌గా 
నటిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్‌గా కనిపిస్తాడు. వీరిద్దరు కలిసి చేసే కామెడీకి జనాలు ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు 
చిత్ర యూనిట్. కాగా ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బయ్యర్లు సైతం ఈ సినిమాను భారీ రేటుకు కొనేందుకు రెడీ అయ్యారు. 
తాజాగా ఈ చిత్ర నైజాం రైట్స్‌ను ఏకంగా రూ. 11.07 కోట్లకు ఏషియన్ ఫిలింస్ సొంతం చేసుకున్నారు.

ఇంతటి భారీ రేటుకు నైజాం రైట్స్ అమ్ముడవ్వడంతో ఈ సినిమా ఎలాంటి సక్సె్స్‌ సాధిస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు 
జనాలు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
సెప్టెంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Share.