కళ్యాణ్ బాబాయ్ బర్త్ డే కి అదే నా సర్ ప్రైజ్: రామ్ చరణ్

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని ఇది వరకే చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితమే యూరోప్ దగ్గర గల అజార్ బైజాన్ అనే ప్రాంతానికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పటి వరకు రామ్ చరణ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అనేది అధికారికంగా తెలియలేదు. అందాల నటి కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇక ఈ రోజు ఉపాసన రామ్ చరణ్ సెల్ఫీ వీడియో ఒకటి తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా షేర్ చేసారు. అందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ” హాయ్ గైస్, మీ అందరికి ఇంకో 24 గంటల్లో ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్న, కళ్యాణ్ బాబాయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి మరి కొన్ని గంటల్లో నేనొక సర్ ప్రైజ్ ప్లాన్ చేసా..కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక వీడియో పోస్ట్ చేయబోతున్న అప్పటి దాక వెయిట్ చేయండి ” అని తెలిపారు హీరో రామ్ చరణ్. చూద్దాం రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వనున్నారో, ఈ సీక్రెట్ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Share.