సచిన్ ని వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ, మరో అరుదైన రికార్డు

Google+ Pinterest LinkedIn Tumblr +

విరాట్ కోహ్లీ ఈ రోజు సౌతాంఫ్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ లో మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో కోహ్లీ 6000 పరుగుల మైలురాయిని కొద్దీ సేపటి క్రితమే చేరుకున్నాడు. 119 ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత బ్యాట్సమెన్ లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండవ ఆటగాడు కోహ్లీ, 117 ఇన్నింగ్స్ తో సునీల్ గవాస్కర్ మొదటి స్థానం లో ఉన్నారు. ఇక ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 6000 పరుగుల మైలురాయిని చేరుకున్నది ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్ మాన్, అతను కేవలం 68 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతని చేరుకోవటం విశేషం.

ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ స్టీవ్ స్మిత్, వెస్ట్ ఇండీస్ దిగ్గజం గ్యారీ సోబెర్స్ 111 ఇన్నింగ్స్ ఈ రికార్డు చేరుకొని రెండవ స్థానంలో ఉండగా, మాస్టర్ బ్లాస్టర్  సచిన్ 120 ఇన్నింగ్స్ లో 6000 పరుగులు సాధించారు.

Share.