తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొట్టమొదటిగా పెళ్లి సందD సినిమాతో పరిచయమయ్యింది శ్రీ లీల.. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించటంతో ఈ ముద్దు గుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా దాదాపు 10 సినిమా అవకాశాలు ఆమె ఖాతాలో వేసుకుంది. పెళ్లి సందడి చిత్రంలో తన అందంతో అనుకువతో నటనతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీ లీల ఇప్పుడు హీరోయిన్లలో స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను సాధించింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ స్టార్ హీరోల వరకు కూడా శ్రీ లీల ఆప్షన్ గా మారిపోయింది.
తాజాగా బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల బాలయ్యకు కూతురి పాత్రలో నటించింది.ఇక ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించటంతో శ్రీ లీలని వదలకుండా ఆఫర్ల వరుస కురిపిస్తున్నారు.నవంబర్ 24వ తేదీ శ్రీ లీల మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో శ్రీ లీలా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కూడా ఈమె అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.
తాజాగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేసినటువంటి ఈమె ఆస్క్ మీ అంటూ నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకు వచ్చారు.ఈ సందర్భంగా నేటిజన్స్ వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఈమె నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు శ్రీ లీల అవును ఇచ్చాన.. నా పనికి నేను కమిట్మెంట్ ఇచ్చాను.
అనడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.