టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే పరిమితం అయిపోయారు.కానీ అక్కడ కూడా ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదని తెలుస్తోంది.
ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ను అందుకున్నటువంటి ఈమెకు ఉన్నట్టుండి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె స్నేహమేనని అంటున్నారు చాలామంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నటించినప్పటి నుంచి ముంబైలోనే స్థిరపడింది ఈ అమ్మడు
అయితే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రియా చక్రవర్తికి మంచి స్నేహితురాలుగా మారిపోయారు.. వీరిద్దరూ కూడా ఎంతో స్నేహంగా ఉండటంతోనే రకుల్ కెరీర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని తెలుస్తోంది. రియా చక్రవర్తి ఈమె దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు అన్న విషయం మనకు తెలిసిందే..అంతేకాకుండా ఈ కేసు విషయంలో ఈమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఈమెకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.
ఇలా సుశాంత్ కేసు నుంచి ఈమె బయటపడినప్పటికీ డ్రగ్స్ కేసులో కూడా ఈమె పేరు పెద్ద ఎత్తున మారు మురోగిపోయింది.ఇలా డ్రగ్ కేసులో రియా చక్రవర్తి పేరుతో పాటు నటి రకుల్ ప్రీతిసింగ్ పేరు కూడా బయటకు వచ్చింది. కేవలం ఆమెతో స్నేహం కారణంగానే డ్రగ్స్ కేసు అలాగే సినిమా చాన్సులు కూడా రకుల్ ప్రీతిసింగ్ కి మిస్ అయ్యాయి.. అలాగే తన కెరీర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని తెలుస్తోంది.