తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్న హీరోయిన్ లలో సమంత కూడా ఒకరు.ఈ అమ్మడు మొట్టమొదటిగా ఏంమాయచేసావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత మరిన్ని ఆఫర్లను అందుకొని పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అయితే సమంత పెళ్లి తర్వాత పెళ్లికి ముందు తన కెరీర్ ని చాలా బాగా విభజించవచ్చు.పెళ్లి తర్వాత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి దూరం గా ఉంటూ వచ్చింది.
సమంత కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకొని ముందుకు సాగుతోంది. అయితే నెగటివ్ రోల్స్ చెయ్యడానికి ఏ మాత్రం సంకోచించని డేరింగ్ హీరోయిన్గా సమంత ఒక ఇమేజిని ఏర్పాటు చేసుకుంది. ఇంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సమంతకి యాడ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి.ఇండియా లో ఇప్పటి వరకు ఆమె ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా, సమంత సోషల్ మీడియా యాడ్స్ కూడా ఒక రేంజ్ లో చేస్తాది.
ఈమె బ్రాండ్ ని ఉపయోగించుకొని తమ ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో సేల్ చేసుకోవడానికి చూస్తుంటారు ఆయా సంస్థలు.ఆమె వల్ల ఆ రేంజ్ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇంస్టాగ్రామ్ లో ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించి పోస్టు పెట్టాలంటే 15 లక్షల రూపాయిల వరకు ఛార్జి చేస్తుందట సమంత. సమంత ఒక్కటే కాదు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లోనే పారతోషకం తీసుకుంటారు.
అయితే సౌత్ నుండి మాత్రం అంతటి డిమాండ్ ఉన్న హీరోయిన్ మాత్రం సమంతానే లేటెస్ట్ గా సమంత ఇంస్టాగ్రామ్ లో బజార్ అనే మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ని అప్లోడ్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఫోటోలు వీడియోలే వైరల్ గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం సమంత గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.