ఆ తప్పు వల్లే ఉదయ్ కిరణ్ కెరియర్ నాశనం అయ్యిందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరి అండలేకుండా అడుగుపెట్టి పలు సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న నటుడు ఉదయ్ కిరణ్ ఈయన మొట్టమొదటిగా చిత్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత పలు సినిమా అవకాశాలు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. చిరంజీవి బాలకృష్ణ లాంటి సినిమాలు ఉదయ్ కిరణ్ సినిమా వస్తోంది అంటే కాస్త లేటుగా రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Uday Kiran Songs || Avunani Antavu - YouTube

అంతటి క్రేజీను ఇమేజ్ను సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్ ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ఉన్నట్టుండి కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొని మరణించాడు.ఎవరి అండాలేకుండా ఇండస్ట్రీలో కొనసాగిన ఉదయ్ కిరణ్ ఉన్నట్టుండి ఈయనకు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి మరణించారు.అయితే ఈయన కెరియర్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఆయన చేసిన తప్పే కారణమంట.

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉదయ్ కిరణ్ చేసిన తప్పేంటి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయ్ కిరణ్ నువ్వు నేను అనే సినిమాలో నటించాడు ఇందులో హీరోయిన్ అనిత ఉదయ్ కిరణ్ ఈ సినిమా ద్వారానే ప్రేమలో పడ్డారట. ఇలా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతూ ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈయన తన ప్రేమకు బ్రేకప్ చెప్పారని తెలుస్తుంది.

అప్పుడప్పుడే తన కెరీర్ ఒక మలుపు తిరుగుతున్నదన్న సమయంలో ప్రేమ అనే విషయంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే తన కెరీర్ నాశనం అవుతుందని అనితనీ దూరంగా పెట్టి బ్రేకప్ కూడా చెప్పేశాడు. ఒకవేళ అనిత ప్రేమని కంటిన్యూ చేసి ఉంటే ఉదయ్ కిరణ్ రేంజ్ వేరేలా ఉండేదని అలాగే తన కెరీర్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయేది కాదని అంతేకాకుండా స్టార్లకు మించిన హోదాలో ఉండేవాడని కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

Share.