కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సౌత్ లో ఈయన నటించిన సినిమాలన్ని సక్సెస్ సాధించాయి. చిన్నతనం నుంచే విజయ్ చాలా అద్భుతంగా నటించేవాడు.అలాంటి విజయ్ ఏ సినిమా చేసిన కూడా సూపర్ హిట్టే అన్నట్లుగా ఉండేది. ఈ మధ్యనే లియో సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే గత కొద్ది రోజులుగా విజయ్ అలాగే తన భార్య విడాకులు తీసుకోబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అంతేకాకుండా విజయ్ నటించిన ఓ సినిమా ఫంక్షన్ కి తన భార్య సంగీత రాకపోవటంతో ఈ రూమర్స్ కాస్త ఎక్కువైయ్యాయి.అయితే ఈ విషయం గురించి స్వయంగా విజయ్ తో నటించిన ఒక నటి రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
ఇంతకు ఆ అమ్మడు ఎవరనుకున్నారు ఈ మధ్యకాలంలో విజయతో కలిసి నటించిన లియో సినిమాలో హీరోయిన్ జనని ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు విజయ్ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునేదాన్ని కానీ ఆయన లియో సినిమా షూటింగ్ టైంలో నన్ను చాలా బాగా పలకరించేవాడు. తన సొంత చెల్లెలి లాగా నన్ను బాగా పలకరించేవాడు.
అయితే నేను ఆయనతో మాట్లాడే సమయంలో శ్రీలంక, తమిళ్ మాట్లాడేదాన్ని.ఇక అలా మాట్లాడేటప్పుడు విజయ్ ప్రతిసారి నువ్వు అలా మాట్లాడుతుంటే నా భార్య సంగీతనే నాకు గుర్తుకు వస్తుందని అనేవాడు.ఎందుకంటే విజయ్ భార్య సంగీత కూడా అదే భాష మాట్లాడుతుంది. కాబట్టి అంతేకాకుండా విజయ్ తన భార్య సంగీత ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు అవన్నీ పుకార్లే అంటూ లియో మూవీలో చేసిన నటి జనని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికైనా వారి పై వస్తున్న పుకార్లు ఆగాలి అంటూ విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు.
కోలీవుడ్లో విజయ దళపతి పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు మాత్రం ఈ విషయం పైన ఎక్కడ స్పందించలేదు. ప్రస్తుతం విజయ్ కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.