టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా దేశముదురు సినిమాతో పరిచయమైన హీరోయిన్ హన్సిక పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.. తెలుగు ఇండస్ట్రీకి మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే టాలీవుడ్లో ఎన్టీఆర్ ,రవితేజ, రామ్, నితిన్ లాంటి హీరోల సరసన నటించిన గుర్తింపు తెచ్చుకుంది హన్సిక.
ఇకపోతే సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉంది మామూలుగా హీరోయిన్లు పెళ్లి తర్వాత లైఫ్ మారిందని కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నామని చాలా హీరోయిన్స్ చెప్పారు. కానీ హన్సిక మాత్రం పెళ్లి తర్వాత ఎటువంటి మార్పు లేదని పెళ్లికి ముందు నేను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని అయితే తన అడ్రస్ మాత్రమే మారిందని చెబుతోంది. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పెళ్లి తర్వాత ఎలాంటి మార్పు లేదు షూటింగ్ సమయంలో క్యారెట్ లో ఉంటాను ఇంటికి వెళ్ళాక నా భర్తతో ఉంటాను అంతే తేడా సాయంత్రం ఆరు తర్వాత నా భర్తకే టైం ఎక్కువగా కేటాయిస్తాను పెళ్లి తర్వాత నా అడ్రస్ మాత్రమే మారింది. నా ఇంటి పేరు కూడా మారలేదు. హన్సిక మోత్వాని అనే ఐడెంటి కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఆ విషయం మనందరికీ తెలిసిందే అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు అంటూ ఆమె కామెంట్స్ చేయటంతో అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక హన్సిక విషయానికొస్తే ఆమె నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది .ఈ సినిమా ప్రచారంలో భాగంగానే హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంది అలాంటి సమయంలోనే ఇలాంటి కామెంట్స్ చేయండి హన్సిక.