అనుష్క అక్కడ దేవతగా కొలుస్తారట..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సినిమాతో పరిచయమైన అమ్మడు అనుష్క శెట్టి..ఈమె అప్పట్లో మంచి సినిమాలను తీసి పేరు సంపాదించుకొని వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోయింది ఒకప్పుడు.. అయితే ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మన ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.. అయితే తాజాగా అనుష్క 42వ బర్తడే ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Anushka calls it a skip for Miss Shetty Mr Polishetty

ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం అనుష్క జార్జియా వెళ్ళిందట. అక్కడికి వెళ్ళాక ఆమెకు జాజా అనే ఒక కార్ డ్రైవర్ నీ పెట్టి అలాగే ఆమె కేర్ టేకర్ గా కూడా ఉంచారట. అలా సినిమా షూటింగ్ సాగుతున్న తరుణంలో ఒకరోజు కార్ డ్రైవర్ జాజా రాకపోవటంతో అనుష్క తన మేనేజర్ ని అడిగిందట. దానికి మేనేజర్ సమాధానం ఇస్తూ జాజా తన కారు లోను కట్టలేదని కారుతో సహా అతన్ని కూడా లాక్కొని పోయారు.. అందుకే ఆయన ఈరోజు మీ దగ్గరికి రాలేదని సమాధానం ఇచ్చారట. ఈ విషయం తెలుసుకున్న అనుష్క వెంటనే జాజా ఇంటికి వెళ్లి మరి ఆయనను కార్ షో రూమ్ కి తీసుకెళ్లి ఒక కాస్ట్లీ బెంజ్ కార్ కొనిచ్చిందట. ఈ కారు కొనియడంతోనే జాజా ఫ్యామిలీ మొత్తం చేతులెత్తి అనుష్కకి ముక్కరట. అప్పటినుంచి అనుష్క దేవతగా కొలిచే వారట.ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

అయితే ఈ మధ్యకాలంలో నిర్మాత శ్యామ్ ఒక పని మీద జార్జియా వెళ్ళినప్పుడు అతని దగ్గర జాజా కార్ డ్రైవర్ పని చేశారని శ్యాంప్రసాద్ తెలుగు వారి అని తెలియటంతో అనుష్క చేసిన సాయం గురించి మొత్తం బయట పెట్టారట.ఇక తన స్నేహితురాలు ఇంత పెద్ద సహాయం చేసిందా అని శ్యాం ప్రసాద్ జార్జియా నుండి తిరిగి వచ్చాక ఈ విషయాన్ని ఇండస్ట్రీ వాళ్లతో అలాగే అభిమానులతో కూడా పంచుకున్నారు.

Share.