పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు.. అలాగే ఇండస్ట్రీలో సినిమా చేయాలని ఉన్న ఈ ఇండస్ట్రీలో దొరకకపోయినా వేరే ఇండస్ట్రీలో అయినా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందుకోసమే కేరళ ఇండస్ట్రీ ఎర్ర తివాచీ పరచుకొని ఉన్నది. అలా తెలుగు నుంచి మలయాళం వైపు అడుగులు వేస్తూ అవకాశాలు సంపాదిస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరు, వారు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
అయితే అందులో ఒకరు అనుష్క ఈమె సైజ్ జీరో సినిమాతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తరువాత రీసెంట్గా మిస్టర్ శెట్టి మిస్టర్ పోలి శెట్టితో కాస్త విజయాన్ని అందుకోవటంతో మళ్లీ ఆమెకు కొత్త చిగురులు వస్తూ ఉన్నాయి. అనుష్క మలయాళం లోకథనార్ — ది వైల్డ్ సోర్సెరర్ అనే థ్రిల్లర్ఫాంటసీ చిత్రం తో అనుష్క తొలిసారి అక్కడ డెబ్యూ చేస్తోంది.
ఇక తమన్నా 20 ఏళ్లు దాటినా కూడా ఇండస్ట్రీలో ఆమె హవా సాగుతూనే ఉంది. టాలీవుడ్ లో పలు సినిమాలు నటించి సక్సెస్ ని అందుకున్నటువంటి మిల్క్ బ్యూటీ ఇంకా ఓటీటి ప్రాజెక్టులతో బిజీగానే ఉంది. అయితే తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హిందీ, తమిళ్, కన్నడ, ఇప్పుడు మలయాళం లో కూడా ఎంట్రీ ఇచ్చింది.మలయాళ హీరో దిలీప్ బాంద్రా చిత్రం లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.
ఇక కృతి శెట్టి ఈమె ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. అంతేకాకుండా పలు అవకాశాలను అందుకొని టాలీవుడ్ లో ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను చేస్తూ ముందుకు సాగిన కృతి శెట్టి ఆ సినిమాలు ఆమెకు నిరాశనే కలిగించాయి. అక్కడ సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడు మలయాళం లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.అజాయంతే రాండమ్ మోషణం అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది కృతి శెట్టి.
మరి వీరందరూ కూడా మలయాళంలో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.