కేరళ బ్యూటీ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె తెలుగులో కూడా స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు అలాగే నాయక్ సినిమాలో నటించింది. తన అందచందాలతో అమలాపాల్ మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో అవకాశాలను అందుకొని ఫేమస్ అయ్యింది.అలా ఈమె సినీ కెరియర్ ముందుకు సాగుతున్న తరుణంలో కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించింది. అంతేకాకుండా ఇరువురి పెద్దలని ఒప్పించి మరి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇక ఆ మధ్యకాలంలో అమలాపాల్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ అది కేవలం ఒక యాడ్ కోసమే అని స్పష్టం చేశారు.అయితే గత పది రోజుల కిందట.. అమలాపాల్ బర్త్ డే అక్టోబర్ 26న ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో అమలాపాల్ కి ప్రపోజ్ చేస్తూ నాలవ్ యాక్సెప్ట్ చేసింది. అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆమెతో ఉన్న రొమాంటిక్ ఫోటోలు, వీడియోలు కూడా అందులో షేర్ చేశారు.అయితే లవ్ యాక్సెప్ట్ చేసి పట్టుమని పది రోజులు కాకుండానే ఆ వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది.
నిన్న అనగా ఆదివారం 5 వ తేదీ అంగరంగ వైభవంగా ఈ కుటుంబ సభ్యుల సమక్షంలో అమలాపాల్ జగత్ దేశాయ్ నీ పెళ్లి చేసుకుంది. కేరళలోనీ ఓ హోటల్లో గ్రాండ్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.అలాగే అమలాపాల్ పెళ్లి చేసుకున్న జగత్ దేశాయ్ పర్యాటక, అతిథ్య రంగాల నిపుణుడు అని తెలుస్తోంది. ప్రస్తుతం అమలపాల్ రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .అంతేకాకుండా కొంతమంది పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.