తెలుగు ఇండస్ట్రీలో నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జునకి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఉంది. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలకు పోటీగా పలు సినిమాలలో నటిస్తూ అభిమానులను ఎంతగానో మెప్పిస్తున్నారు. ఓవైపు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో లో హోస్టుగా రాణిస్తున్నాడు. ఇప్పటికీ నాగార్జున వయస్సు 60 ఏళ్లు దాటిన తన కొడుకుల కంటే నాగార్జునే ఎక్కువ సినిమాలను చేస్తున్నాడు.
ఇక అన్ని బాగానే ఉన్నప్పటికీ ఆయనకి కేవలం కొడుకుల విషయంలోనే దిగులు పట్టుకుంది. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా ఎంతో యంగ్ గా కనిపించే నాగార్జున ఈ మధ్యకాలంలో కాస్త లుక్ చేంజ్ అయిపోయింది. దానికి కారణం తన కొడుకుల సినీ కెరియర్ నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు.ఆ విషయంలో నాగార్జునకు కొంచెం దిగులు పట్టుకుందని టాలీవుడ్ మీడియాలో ఇప్పటికే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా కాస్త పక్కన పెడితే నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమా ద్వారా మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కుర్ర హీరో అయినా రాజ్ తరుణ్ అలాగే కమెడియన్ అల్లరి నరేష్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదల కానుంది అంటూ మూవీ యూనిట్ ప్రకటించింది.
ఇదంతా ఒక ఎత్తైతే ఈ మధ్య నాగార్జున ఓ మీడియా ఛానల్ ప్రమోషన్ లో భాగంగా తనకి ఇష్టమైన ఆహారం ఏంటి అనే విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టారునాగార్జునకి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే రైస్ అలాగే ఉలవచారు, హాట్ చిప్స్, నెయ్యి ఇవన్నీ అంటే చాలా ఇష్టమట. అంతేకాకుండా వీటన్నింటిని నేను ఎంతో ఇష్టంగా తింటాను అంటూ ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఫుడ్ విషయం గురించి బయట పెట్టిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.