సినిమా పేరు చెప్పలేకపోయినా పవన్ కళ్యాణ్.. ఈయన సీఎమ్మా అంటూ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యలో కొన్ని ఈవెంట్స్ కూడా హాజరవుతూ అందరిని ఆనందపరుస్తూ వస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఒక తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ హాజరయ్యారు ..సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వార్తల కోసం ఆ ఛానల్ ని లాంచ్ చేయబడింది.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా గురించి సినిమా జర్నలిజం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పొత్తులపై ఫైనల్, ఢిల్లీకి పవన్ - చంద్రబాబు దగ్గరే "లాక్"..!! | Pawan Kalyan  to meet BJP Leaders in his Delhi Tour today, May finalise Alliance in TS  Elections - Telugu Oneindia

ఇక ఇదే వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల నుంచి మీ ఛానల్ కు మద్దతు ఇప్పిస్తాను అంటూ పేర్కొన్నాడు.. ఈ క్రమంలోనే తను చేస్తున్న సినిమాల నిర్మాతల పేర్లు చెబుతూ వకీల్ సాబ్ దర్శకుడు దిల్ రాజు సర్దార్ భగత్ సింగ్ గా ఏదో ఉంది సినిమా పేరు భగత్ సింగ్ ఈ సినిమా నిర్మాత నవీన్ నుంచి అయితే మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా టైటిల్ ని మర్చిపోవడం ఆ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంపై నేటిజన్స్ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న సినిమా జర్నలిజం గురించి మాట్లాడుతూ.. సినిమా వారి గురించి కాంట్రావర్షియల్ న్యూస్ మాత్రమే కాకుండా చలనచిత్ర సినిమాలో ఎంతోమంది గొప్ప దర్శకులు కళాకారులు ఉన్నారు.. వారి గురించి కూడా ప్రేక్షకులకు ముఖ్యంగా తెలియజేయాలని ఈ ఛానల్ పని చేయాలని కోరుకుంటున్నాని తెలిపారు. అలాగే కొన్ని సున్నితమైన అంశాలలోకి సినిమా పరిశ్రమ వ్యక్తులను లాగుతున్నప్పుడు మీరు వారికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని మాటలను వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు దగ్గర పడుతుండటంతో టెన్షన్లో ఇలా మాట్లాడు ఉండవచ్చునని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది సినిమా పేరే మర్చిపోతే ఈయన సీఎం ఎలా అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share.