తెలుగు ఇండస్ట్రీలో బద్రి సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను రేణు దేశాయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే విడాకులు తీసుకున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యనే రవితేజ తో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రలో నటించింది. ఆ పాత్రకు రేణు దేశాయ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.
అయితే తాజాగా ఆమె ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొనింది. అయితే ఆమెకి కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.. అవేంటంటే పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా..? అని అడగ్గా ఆయన గురించి ఈ క్వశ్చనే వద్దు నవ్వుతూ ఆయన సీఎం అవుతారా లేదా అన్నది ఆ భగవంతునికే తెలుసు నన్ను మాత్రం ఆ క్వశ్చన్ అడగొద్దండి అంటూ సమాధానం చెప్పింది.
పలాన వ్యక్తిని గెలిపించండి అంటూ కూడా నేనేమి ప్రచారం చేయను అది నాకు అవసరం లేని విషయం పవన్ కళ్యాణ్ విషయంలో నేను అన్ని నిజాలే చెప్పాను విడాకుల సమయంలో ఏం చెప్పానో అవన్నీ నిజాలే అని చెప్పింది రేణు దేశాయ్ ..కావాలంటే లైవ్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. అని రేణు చెప్పారు నేను మరో పెళ్లి చేసుకుంటాను కానీ నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను ముఖ్యంగా ఆధ్య కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ముందుగా నా పిల్లలను సరైన క్రమంలో పెంచాలి అలాగే పెంచడానికి ట్రై చేస్తున్నాను.ముఖ్యంగా ఆద్యనీ అకిరాకి సమాజంలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాను. అని తెలియజేసింది.
రేణు దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ ఇస్తున్న వార్నింగ్ టైగర్ నాగేశ్వరరావు చిత్రం వల్ల నేను ఈ మధ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. దీంతో పవన్ గారి ఫ్యాన్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ గురించి మాట్లాడకండి అంటూ చాలా మంది చాలా కామెంట్స్ లను చేస్తున్నారు అంటూ రేణు దేశాయ్ ఈ సందర్భంలో తెలియజేసింది.