నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ,యాక్షన్, ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ శరవేగంగా చేపట్టారు చిత్ర బృందం.
ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక దీనికి తోడుగా పాటల్ని కూడా విడుదల చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుందని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా తాజాగా విడుదలకు ముందే ఈ సినిమా అదరగొడుతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ టికెట్టు బుకింగ్స్ కోసం పలు ఆన్లైన్ టికెట్ సంస్థలు ఓపెన్ చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తోందట. ఇక రేపు విడుదల కానున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో మంచి బుకింగ్ తో అదరగొడుతుందని సమాచారం.
అంతేకాదు కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ కూడా అవుతోందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటారని, ఇక ఆయనకు ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించబోతుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకోగా.. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ కూడా అందించింది. 155 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా దాదాపుగా రూ .100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని సమాచారం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ.67.35 కోట్లు జరగగా.. రూ.68.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోందని సమాచారం.
OCTOBER 19th IN THEATRES
is going to be absolutely…….😉🔥Book your tickets now for #BhagavanthKesari 💥💥
Natasimham #NandamuriBalakrishna 🦁
An @AnilRavipudi Film ❤️🔥@sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @LyricsShyam @sahugarapati7… pic.twitter.com/CvH9LJYfhH— Shine Screens (@Shine_Screens) October 17, 2023