ఆ చిన్న తప్పు వల్ల హీరోయిన్ కాలేకపోయినా రేణు దేశాయ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు . ఎందుకంటే తను కూడా ఇండస్ట్రీలో ఇమేజ్ ని బాగానే పెంచుకుంది.సోషల్ మీడియా లో కూడా ఈమె తరచూ యాక్టీవ్ గా ఉంటుంది.

Pawan's Full Support To Renu Desai | cinejosh.com

పూణే నుండి మోడల్ గా మంచి పాపులారిటీని దక్కించుకున్న రేణు దేశాయ్, ఆ తర్వాత పూరి జగన్నాథ్ ద్వారా ఆమెని బద్రి సినిమాకి ప్రమోట్ చేశారు. ఇక ఆ సినిమా నుంచి మొట్టమొదటిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది రేణు దేశాయ్..ఆ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో కూడా ప్రేమలో పడి కొంతకాలం డేటింగ్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారి జీవితంలో కొన్ని విభేదాలు రావడం వల్ల విడాకుల వరకు దారితీసింది.

 

ఆ తరువాత ఆమె చివరి చిత్రం జానీ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలో కూడా నటించలేదు.చాలా కాలం తర్వాత ఆమె లేటెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రం లో ఒక ముఖ్య పాత్ర ద్వారా మన ముందుకి వస్తుంది.ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ కి బద్రి చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి.కానీ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన తర్వాత ఇక నటించకూడదు అని ఫిక్స్ అయ్యింది.

అలాగే మహేష్ బాబుతో నటించే సినిమా అవకాశాన్ని కూడా రేణు దేశాయ్ కోల్పోయింది.. అదే ఎ సినిమా అంటే మురారి..ఈ చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉందో చెప్పనక్కరలేదు..మహేష్ బాబు సినీ కెరియర్లో ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా కూడా అనుకోవచ్చు. ఈ సినిమా కోసం ముందుగా రేణు దేశాయిని అనుకున్నారట. కానీ ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో చెప్పి పంపించేసిందట.ఆ తర్వాత హిందీ నుండి సోనాలి బింద్రే కొనసాగించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.

Share.