ఏంటి నిజంగా హీరోయిన్ శృతిహాసన్ తల్లి అవుతుందా అంటే అవును అంటున్నారు మెజారిటీ నేటిజన్స్.. అయితే శృతిహాసన్ తల్లి అవుతుంది అనడానికి ప్రూఫ్ ఏముంది ఎందుకు ఈ వార్త వైరల్ గా మారుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.హీరోగా తన తండ్రి కమలహాసన్ ఏ రేంజ్ లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే.. అతని కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తండ్రి సపోర్టు లేకుండా సొంతంగా ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతోంది.
అయితే కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది. ఈ మధ్య ప్రభాస్ తో కలిసి సలార్ అనే పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తోంది.. అదికూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది కాస్త పక్కన పెడితే గత కొన్ని రోజులుగా శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ అయినా శాంతాను హాజరిక అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పటికే ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేసిన ఈ అమ్మడు శాంతాను హజారికతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు సమాచారం.
అయితే డేటింగ్ మాత్రమే తనకి ఇష్టం.. పెళ్లి విషయం వస్తే అసలు క్లారిటీనే ఇవ్వదు. పెళ్లి అంటేనే బోరింగ్ అనే విధంగా మాట్లాడుతుంది. అలాంటి ముద్దుగుమ్మ త్వరలో ఒక సీక్రెట్ చెపుతాను అంటు తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే నా దగ్గర ఒక రహస్యం ఉంది అది చాలా రోజులు దాచి పెట్టలేను ఆ విషయాన్ని మీ అందరితో చెప్పటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ చూసిన అందరూ కొంపతీసి పెళ్లి వార్త చెబుతుందా లేకుంటే బేబీ బంప్ లాంటివి ఏమైనా చేస్తుందా అంటూ గుడ్ న్యూస్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.