ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొట్టమొదటిగా శ్రీ ఆంజనేయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ సినిమాలో తన నటనను పలు ఆఫర్లు వచ్చాయి ఛార్మికి. అంతేకాకుండా ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి మార్కులను కొట్టేసింది ఛార్మి. ముఖ్యంగా అప్పట్లో ఉన్న అగ్ర హీరోలు అందరితోనూ కలిసి నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది. ఒకప్పుడు అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఛార్మి ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ కి గురవుతోంది.
ఈ మధ్యన సినిమా అవకాశాలు లేకపోవటంతో నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాను తెరకెక్కించారు. కానీ ఆ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమా తర్వాత ఛార్మికి, పూరి కి మధ్యలో ఏదో అఫైర్ నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయి.
అయితే లైగర్ సినిమా తరువాత ఛార్మి కొద్ది రోజులు కనిపించలేదు. మళ్లీ పూరి జగన్నాథ్ బర్త్ డే సెప్టెంబర్ 28న కనిపించి నైట్ 12 కి కేక్ కట్ చేస్తూ కనిపించింది.అంతేకాకుండా ఆబర్త్డే ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. ఇవి శాశ్వతమైన సెలబ్రేషన్స్ అంటూ కూడా కామెంట్స్ పెట్టింది. ఈ కామెంట్స్ చూసిన జనాలు వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఎఫైర్ ఉందని కన్ఫామ్ చేసుకున్నారు.
కాగా ఛార్మిపై మరో రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీతో రిలేషన్ లో ఉంది అంటూ చార్మి పై వార్తలు వినిపించాయి. ప్రజెంట్ గా కూడా వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోంది అంటూ అందుకే పూరి జగన్నాథ్ ని పక్కకి పెట్టేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఛార్మి ఇద్దరు డైరెక్టర్ల మధ్య నలిగిపోతోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానుల సైతం చర్చించుకుంటున్నారు.