త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సింగర్ మంగ్లీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈమె తీన్మార్ అనే ప్రోగ్రాం లో తన మాటలతో వేషంతో ఎందరినో ఆకట్టుకుంది. ఫోక్ సాంగ్ పాడాలంటే కచ్చితంగా మంగ్లీ నే గుర్తొస్తుంది. అందరినీ తన అద్భుతమైన గానంతో అట్రాక్ట్ చేస్తుంది. అలా మంగ్లీ కి ఎన్నో అవార్డులు కూడా అందుకోవడం జరిగింది.. ఈమె పాడిన అలా వైకుంఠపురం లోనీ రాములో రాముల పాటకి ఎంత క్రేజ్ దక్కిందో మనందరికీ తెలుసు.. మొన్నటికి మొన్న బలగం సినిమాలో పల్లెటూరి గురించి ఒక సాంగ్ పాడింది ఆ సాంగ్ ఎటు చూసినా మారుమ్రోగిపోయింది.

Tollywood singer Mangli's car pelted with stones in Karnataka

ఒకప్పుడు సింగర్ మంగ్లీ కేవలం జానపద పాటలు మాత్రమే పాడేది.. ఇప్పుడు అన్ని పాటలను అవలీలగా పాడేస్తోంది. అంతేకాకుండా సినిమాల పరంగా స్టార్ సింగర్ గా మారిపోయింది. ఇప్పటికీ కూడా బతుకమ్మ పాటలు దేవుళ్ల పాటలు బోనాల పాటలు పాడి ఫేమస్ అవుతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమాలలో ఆమె పాడిన పాటలన్నీ మంచి సక్సెస్ లనే సాధించాయి.

ఒకవైపు సింగర్ గా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంగ్లీ నటిస్తోంది. నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో సినిమాలో నెగిటివ్ పాత్రలో మంగ్లీ నటించి అదరగొట్టింది. ఇదంతా కాస్త పక్కన పెడితే ఈ మధ్యనే సోషల్ మీడియాలో మంగ్లీ పై ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే మంగ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం మంగ్లీ కి పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని సమాచారం.

అంతేకాకుండా మంగ్లీని కూడా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతోందట. అయితే మంగ్లీ తన తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోబోతోందని తెలుస్తోంది. అది కూడా మంగ్లీ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి నేనట.ఆయన మంగ్లీ కి బావ వరుస అయ్యే అబ్బాయిని పెళ్లాడుతోందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share.