టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేష్ అప్పట్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడే.. అయితే ఈయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. ఈమె తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తోంది ఈ అమ్మడు.
అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఐశ్వర్య రాకేష్ టాలీవుడ్ హీరోల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది. మొదట్లో ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హీరోలు వారి సినిమాలలో అవకాశాలు మనకి కలిగించాలంటే హీరోయిన్ కి మార్కెట్లో మంచి పలుకుబడి ఉండాలి. లేదంటే ఆమె స్టార్ధం పొజిషన్లో అయినా ఉండాలి. లేదంటే సాదా సిదా హీరోయిన్స్ కు అవకాశాలు ఇవ్వరు. ఈ రెండు విషయాలని పరిగణలోకి తీసుకుంటారు.
ఇక నాలాంటి హీరోయిన్లకు అసలు అవకాశాలే కరువు అవుతాయి. అయితే హీరోలు తమ సినిమాలలో అవకాశాలు ఇవ్వకపోయినా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్ నేను హీరోలేని సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకుంటున్నాను.. తెలుగు హీరోలు కూడా అదే విధంగా ఆలోచిస్తారా అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు మన తెలుగు హీరోలకి హీరోయిన్లతో టాలెంట్ తో అసలు పనే ఉండదు ఎందుకంటే హీరోయిన్ అందంగా ఉంటే చాలు హీరోలకి హీరోయిన్లు అందంగా మాత్రమే కనిపించాలి. ముఖ్యంగా తెలుగు హీరోలకి అందం ప్రధాన కారణం అంటూ ఈ సందర్భంలో తెలియజేసింది. ఐశ్వర్య రాజేష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దాదాపుగా ఇప్పటివరకు 50 సినిమాలలో నటించిన ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది.