హాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియా మొత్తాన్ని ఏలేస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ ఈమె మిస్ వరల్డ్ అయినప్పటికీ ఏమాత్రం గర్వం ఉండదు. ఈ అందాల ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి హీరోయిన్గా కొన్ని ఏళ్లపాటు కొనసాగింది. మొట్టమొదటిగా సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఆ తర్వాత ఆయన టార్చర్ భరించలేక వదిలేసి బాలీవుడ్ అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే..
ఇక వీరిద్దరికీ ఆరాధ్య రాయ్ అనే ఒక పాప ఉన్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఆరాధ్య 5వ తరగతి చదువుతోంది అయితే తాజాగా సోషల్ మీడియాలో ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య రాయ్ చదివే స్కూల్ ఆమె ఫీజు ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఆరాధ్య స్కూల్ ఫీజు ఎంతో తెలుసుకుందాం.
ఆరాధ్య చదివే స్కూల్ పేరు ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ స్కూల్లో చాలామంది సెలబ్రిటీల పిల్లలు చదువుతున్నారు. అంత పెద్ద స్టార్స్ పిల్లలు చదువుతున్నారంటే ఆ స్కూల్ ఫీజు ని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా అంబానీ స్కూల్ అంటే ఏ రేంజ్ లో ఫీజు ఉంటుందో చెప్పనవసరం లేదు.. ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి 5 క్లాస్ లోపే రూ.5లక్షల పైగా ఫీజులు ఉంటాయట. 8తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ లోపు చదివే పిల్లలకే 15 నుండి 20 లక్షల లోపు ఫీజు ఉంటుందట.
ఇలా ఈ ఫీజు మాత్రమే కాకుండా ఎగ్జామ్స్ ఫీజు ఇంకా అదనపు ఖర్చులు భారీగానే ఉంటాయట. ఈ లెక్కన ఆరాధ్య ఫీజు చూసుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఐశ్వర్యరాయ్ కూతురు తన తల్లికి తగ్గట్టుగానే ఉందని ఈమె ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.