తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరు తెచ్చుకున్న హీరో నాగార్జున.. ఈయనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది..ఇప్పటికే నాగార్జున చాలా మంది హీరోయిన్ల ప్రేమలో పడ్డాననే వార్తలు ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. అయితే నాగార్జునకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఫిజికల్ గా ఎప్పుడు కలవలేదట. కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడేవాడంటు ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పుకొచ్చారు.
నాగార్జున మొదటి భార్య లక్ష్మి ఈమెకు విడాకులు ఇవ్వటానికి కారణం అమలా అనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ వీరిద్దరి విడాకులకు అమల కారణం కాదట. మరో హీరోయిన్ అట..ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు..ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రజిని.. నాగార్జున, రజిని కాంబినేషన్లో మురళీ కృష్ణుడు, మజ్ను, అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారి అబ్బాయి ఇలా వీరిద్దరి కాంబోలో కొన్ని సినిమాలు వచ్చాయి.
ఇక వీరిద్దరూ ఈ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే నాగార్జునకు, రజనీకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అది కాస్త ఎఫైర్ పెట్టుకునే వరకు వెళ్ళిందట. అంతేకాకుండా రజినీకి చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో నాగార్జునతో చట్టపట్టలేసుకొని తిరిగేదట. ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు తన కూతురి జీవితంలో నిప్పులు పోయటానికే ఈ హీరోయిన్ వచ్చిందనుకొని ఎలాగైనా ఈమెకు బుద్ధి చెప్పాలి అనుకొని దాసరి నారాయణ రావు కి ఈ విషయాన్ని చెప్పారట.
ఇక దాసరి నారాయణరావు ఆ హీరోయిన్ ని పిలిపించి నువ్వు ఇక్కడికి వచ్చినపనేంటి నువ్వు చేస్తున్న పని ఏంటి ఇలాగే చేసుకుంటూ పోతే నీ జీవితం నాశనమవుతుంది.. నాగార్జునకు పెళ్లయిందని తెలిసి ఎందుకు అలా ఆయన వెంబడి పడుతున్నావని వదిలేయకపోతే నీకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడట. దాంతో చేసేదేమీ లేక నాగార్జునను వదిలిపెట్టింది రజిని.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.