రంభ అప్పుల పాలు కావడానికి కారణం అదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో రంభ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె అప్పటి హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రంభ అనంతరం వరుస ప్లాప్ సినిమాలను చవిచూస్తూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది.ఈమె టాలీవుడ్ లోనే కాకుండా తమిళ భాషలలో కూడా అగ్ర హీరోల సరసన నటించింది.

Ramba And Husband To Get Back Together | Silverscreen India

అయితే రంభ కు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని ఉద్దేశంతో నిర్మాతగా మారింది. ఆలా నిర్మాతగా మారి రంభ త్రీ రోజెస్ అనే సినిమాని చేశారు..ఇందులో రంభ ,జ్యోతిక ,లైలా ముగ్గురు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవటంతో ఆమె అప్పుల పాలైపోయింది. అయితే ఈ సినిమా కోసం రంభ చెన్నైలో ఉన్నటువంటి ఓ బంగ్లాను తాకట్టు పెట్టిందట.

Three Roses | Tamil Full Movie HD | Jyothika | Rambha | Laila |  #tamilmovies #jdcinemas #tamilmovie - YouTube

సినిమా సక్సెస్ కాకపోవటంతో అప్పుల ఒత్తిడి ఎక్కువయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బంగ్లాను అమ్మేసింది. ఆ బంగ్లా అమ్మిన తరువాత కూడా తన అప్పులు తీరలేదు.. అప్పులు తీరకపోవడంతో పలు సినిమాలలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇలా తన అప్పులను మొత్తం సినిమాలలో సంపాదించిన డబ్బులతో చెల్లించింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఎంతగానో సంపాదించుకొని ఆమె నిర్మాతగా మారి ఒక్క సినిమా చేయటంతో తీవ్రంగా అప్పుల పాలై ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రంభకు

ఇక అప్పులన్నీ తీరిపోయిన తర్వాత రంభ కెనడాకు చెందిన ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. విరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఈ మధ్యనే చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా విడాకుల వరకు దారి తీసిన వీరి వ్యవహారం కుదుటపడి సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం రంభ గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share.