తెలుగు ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఈ అమ్మడు తెలుగులో పలు సినిమాల్లో నటించింది.ఈమె నటించిన పాత్రలన్నింటికీ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చివరిగా ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా తర్వాత ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. టైర్2 హీరోల సినిమాల్లో నటించిన కూడా మంచి అవకాశాలు వచ్చి బిజీగా ఉండేది.
కానీ అప్పుడు పరిస్థితులు అలా లేవు.. రాశి ఖన్నా కి.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి. తగ్గిపోవడమే కాదు అసలు ఇప్పుడు ఆమెకు ఒక్క సినిమా అవకాశం కూడా లేదు. దాంతో ఈమె ఏం చేస్తుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాశి ఖన్నా సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించేందుకు ఓకే అంటుంది..కానీ వెబ్ సిరీస్ మేకర్స్ కూడా తన వైపు చూడటం లేదు.
ఒకప్పుడు టైర్ -2 హీరోలు రాశి ఖన్నాతో సినిమా తీయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు.. కానీ ఇప్పుడు వారు కూడా రాశి ఖన్నానే పక్కకు నెట్టేశారు. పాపం రాశి ఖన్నా తమిళంలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. రెండో సినిమాల విషయం అంటారా అవి కూడా చిన్న సినిమాలే ఒకవేళ అవి కూడా తమిళంలో మంచి సక్సెస్ సాధిస్తే తప్పకుండా తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రాశి ఖన్నా కి సినిమా అవకాశాలు రాకపోతే తన కెరీర్ క్లోజ్ అయినట్లే అని అంటున్నారు ఫ్యాన్స్. ఈమె అందంతో ఆరబోతకి సోషల్ మీడియాలో నేటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఏదేమైనా మళ్లీ రాశి ఖన్నాకు తెలుగులో సినిమా అవకాశాలు రావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. మరి ఫీడ్ అవుట్ హీరోయిన్ గా మిగిలిపోతుందేమో చూడాలి మరి.