టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ తమన్నా.. తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తూ కుర్రకారును తన వెంట తిప్పుకుంటున్న బ్యూటీ తమన్నా.. పలు అగ్ర హీరోల సినిమాలలో నటించింది. అయితే ఈమధ్య తమన్నా తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తమన్నా పై ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే తమన్నా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందట. ఈ విషయం తెలిసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఏంటి అని అభిమానులు అందరూ అయోమయంలో పడిపోయారు.
అసలు విషయం ఏంటంటే..నిప్పు లేనిదే పొగ రాదు అంటారు అంటే నిజంగానే తమన్నా తల్లి కాబోతోందా అంటూ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే అసలు విషయంలోకి వెళ్తే తమన్నా సౌత్ నార్త్ లో వరుస సినిమా అవకాశాలను చేస్తూ ఈ మధ్యనే విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడిపిస్తున్న విషయం బయటపడింది. బయటపడిన వెంటనే పెళ్లి గురించి తమన్నాను ప్రశ్నిస్తే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది కానీ ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల పైనే ఉంటుంది. అంటూ క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు తమన్నా తల్లి కాబోతోంది అని వస్తున్న వార్తల విషయానికొస్తే.. తమన్నా తల్లి కాబోతోంది అన్నది నిజజీవితంలో కాదట రీల్ లైఫ్ లో తమన్నా ఒక తల్లి పాత్రలో కనిపించబోతోందట. అది పట్టుకొని అందరూ తమన్నా తల్లి కాబోతోంది అంటూ ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తమన్నా హీరోయిన్ గానే చేసింది.. కానీ ఇప్పుడు తల్లి పాత్రలో కూడా చేయటానికి సిద్ధమయ్యిందట.. కారణం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి పాత్రలే వస్తాయి పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకోవచ్చు కదా అంటూ పలువురు నెటిజెన్స్ తమన్నాకి సలహాలు ఇస్తున్నారు.