ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో సినిమాలను చేస్తున్న హీరోయిన్ శ్రీ లీల అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించింది. ఈ అమ్మడు నిన్నకాక మొన్న వచ్చి ఏకంగా 12 సినిమాలను దక్కించుకుంది. మొట్టమొదటిగా పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకొని కుర్రాలను తన వైపు లాక్కుంది. అయితే ఈ ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలన్నింటిలోనూ శ్రి లీల ఉండబోతోంది. ఇప్పటివరకు చాలా చాలామంది హీరోయిన్స్ వచ్చారు కానీ ఈ స్థాయిలో డిమాండ్ ని రప్పించుకున్న హీరోయిన్ మాత్రం శ్రీ లీలాదే
ఈ అమ్మడు డిమాండ్ తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ అలాగే ఉంటోందట..ఈమె ఒక్కో సినిమాకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇక మీదట చేయబోయే సినిమాలకు 7 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలట.అయితే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తమన్నా, సమంత, లాంటివారే డిమాండ్ చేయటం లేదు.. అలాంటిది శ్రీ లీల బాగానే డిమాండ్ చేస్తోందని అంటున్నారు.ఇదిలా ఉండగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి ఈ హీరోయిన్ ఛార్జ్ చూస్తే మతి పోవాల్సిందే
అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఒక షాపింగ్ మాల్ కి వెళ్తే ఒక్క నిమిషం ఉంటే పది లక్షల రూపాయలు ఇవ్వాలట. అలా ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని పది లక్షలు దీనితో పాటు ఆమె ఫ్లైట్ ఖర్చులు అలాగే భోజనం ఖర్చులు ఇలా ఆమె ఖర్చులన్నీ మాల్ యాజమాన్యమే భరించాలట.శ్రీ లీల అంటే కుర్రాళ్ళు ఎగబడుతున్నారు మరి ఆ మటుకు డిమాండ్ చేయటంలో తప్పు లేదని అంటున్నారు నేటిజన్స్
అంతేకాదు ఈమె చేతి గుండా ఓపెనింగ్ చేసిన మాల్స్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి శ్రీ లీల ఎంత డిమాండ్ చేసిన కాదనటం లేదు యాజమాన్యం.