తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న వారిలో దివంగత నటి శ్రీదేవి కూడ ఒకరు.. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. శ్రీదేవి అకాల మరణంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. శ్రీదేవి నట వారసురాలిగా నటి తన కూతురు జాన్వీ కపూర్ గా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే..
తాజాగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాళ్ల అమ్మ కోరుకున్నట్లుగానే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జాన్వీ కపూర్. అయితే ఈమె ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జాన్వీ కపూర్ కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
అయితే ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలోకి విజయ్ లేదా అజిత్ సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వాలన్నదే తన తండ్రి కోరికట.. తన కూతురి విషయంలో తనకు ఒక కండిషన్ విధించారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి కనుక ఎంట్రీ ఇస్తే ఏ హీరోతో నటించిన ప్రాబ్లం లేదని కానీ ఒక హీరోతో మాత్రం అసలు నటించవద్దు అంటూ తన కుమార్తెకు కండిషన్ పెట్టాడట. మరి ఇంతకు ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ ను అందుకుంటూ ముందుకు వెళుతున్న హీరోలలో ధనుష్ ఒకరు. ధనుష్ కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ హాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలలో మంచి మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఇంతటి స్టార్ధం ఉన్న హీరో సినిమాలో నటించకూడదని జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ నటించకూడదనే కండిషన్ ని పెట్టినట్లు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టారనే విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.