టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా దేశముదురు చిత్రంతో పరిచయమైన హీరోయిన్ హన్సిక ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.. కానీ దేశముదురుకు వచ్చిన ఏ సినిమాకి రాలేదు. ఈమె తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ ,హిందీ భాషలలో కూడా తన ప్రతిభను చాటుకుంది. సినిమాల పరంగా ఓకే కానీ అఫైర్స్ కొనసాగించడంలో హన్సిక కెరియర్లో మచ్చగా మిగిలిపోయింది. అప్పట్లో ఆమె కుర్ర హీరోలతో కలిసి చెక్కర్లు కొట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది.
ముఖ్యంగా శింబు తో ప్రేమాయణం సాగించి దాదాపు పెళ్లి వరకు దారితీసింది. అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి విషయం సోషల్ మీడియాలో కూడా ప్రకటించారు.. కానీ ఉన్నఫలంగా హన్సిక హాట్ బ్రేక్ అయిపోయి శింబు కి బ్రేకప్ చెప్పేసిందట. మరి హన్సిక హాట్ బ్రేక్ అవ్వటానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా శింబు హన్సిక చాలా గాఢంగా ప్రేమించుకున్నారట. హన్సిక ఎక్కడికి వెళ్లినా శింబు కూడా అక్కడ కనిపించేవాడట. అంతలా వీరిద్దరూ ప్రేమించుకున్నారు..కానీ వీరిద్దరి మధ్య బ్రేకప్ కి కారణం ఒక హీరో అంటున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు తమిళనాడు నటుడు ఉదయనిది స్టాలిన్.. హన్సిక, ఉదయనిది స్టాలిన్ ఇద్దరు కలిసి ఒకే ఒకే సినిమాలో నటించారు.
ఆ టైంలోనే హన్సిక ఉదయనిది ,స్టాలిన్ తో కాస్త క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేదట. కొన్నాళ్లపాటు గుట్టుగానే సాగిన వీరి ప్రేమ బంధం ఆ నోట ఈ నోట పాకి శింబు వరకు చేరిందట. ఈ విషయం తెలుసుకున్న శింబు కోపంతో రగిలిపోయి. ఆమెకి ఫోన్ చేసి చడామడ తిట్టేసాడట. హన్సిక తనని తప్పా ఎవరిని ప్రేమించడం లేదని చెప్పినా కూడా శింబు ఆ పరిస్థితిలో వినేలా కనిపించలేదట. దీంతో హన్సిక మనసు విరిగిపోయి శింబు కి బ్రేకప్ చెప్పేసిందట. ఇలా ఉదయనిది కారణంగా శింబు, హన్సిక విడిపోయారని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.