బాలయ్య మూవీలో కాజల్ కంటే శ్రీలీల కే ఎక్కువ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నప్పటినుంచి సినిమా అవకాశాలను అందుకొని ఇప్పటికీ కూడా ట్రెండీలో ఉన్న హీరో బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల అఖండ , వీరసింహారెడ్డి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పనవసరం లేదు.. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రాబోతోంది.. ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుతోంది. అయితే ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుందని అధికారకంగా ప్రకటించారు.

Balayya, Kajal & Sreeleela Rocking On Dance Floor

ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో ఉన్న హీరోయిన్ శ్రీ లీల కనిపించబోతోంది. అయితే సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో తర్వాత అత్యధిక పారతోషకం హీరోయిన్ కే ఉంటుంది..కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ కంటే అధికంగ శ్రీ లీల ఈ సినిమాలో పారతోషకం ఎక్కువగా అందుకుతోందని సమాచారం.

శ్రీ లీల కు దాదాపు రూ .3 కోట్లకు పైగా పారతోషకం నిర్మాతలు అందిస్తున్నారని.. కాజల్ అగర్వాల్ కి కేవలం కోటి రూపాయల మాత్రమే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీ లీల ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.ఆమె ఏ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన కూడా అంతకంటే ఎక్కువ పారతోషకం తీసుకుంటుంది అంటూ ఆమె సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమాలో బాలకృష్ణకి కూతురు పాత్రలో కనిపించబోతోందని మొదటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కొంతమంది కూతురి పాత్రలో కాదు అంటూ వాదిస్తున్నారు.అయితే అసలు విషయం ఏంటో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.. ఈ సినిమా గురించి నందమూరి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. మరి అభిమానులను మెప్పించే విధంగా ఉంటుందేమో చూడాలి మరి.

Share.