ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వార్తల విషయాలలో వేణు స్వామి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. సెలబ్రిటీల విషయాల్లో అలాగే రాజకీయ నాయకుల విషయాల్లో చెప్పింది చెప్పినట్లు జరగటంతో చాలా మంది ఇయన్ని నమ్మి పూజలు దోషాలు లాంటివి చేయించుకుంటున్నారు. అందులో చాలామంది హీరోయిన్స్ ఇలాంటివన్నీ చేసి స్టార్ హీరోయిన్స్ పొజిషన్లో కూడా ఉన్నారు.
ముఖ్యంగా ఈయన చెప్పే మాటలు నమ్మే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ముందుగా ఈయన సమంత, నాగచైతన్య విడిపోతారని ఉపాసన రాంచరణ్ లకు చాలా ఆలస్యంగా పిల్లలు పుడతారని తెలియచేశారట..అంతేకాకుండా టాలీవుడ్ లో ఒక హీరో చనిపోతాడు అంటూ కూడా గతంలో తెలియచేశారు ఆయన తెలియజేసినట్టుగానే తారకరత్న మరణించి అందర్నీ షాక్ గురి చేశారు. ఎందుకంటే వేణు స్వామి చెప్పిన మాటలన్నీ అక్షర సత్యం కావడంతో వేణు స్వామిని పూర్తిగా నమ్మేశారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి టాలీవుడ్ హీరోయిన్ గురించి షాకింగ్ న్యూస్ ని వెల్లడించారు. అదేంటంటే మరికొన్ని నెలలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 40 సంవత్సరాల లోపు హీరోయిన్ చనిపోతుందని ఆయన ఉన్నట్టుండి బాంబు పేల్చాడు ఇలా 40 సంవత్సరాల లోపు హీరోయిన్ చనిపోతారా అంటే అందరికీ సమంతనే అనుకున్నారు ఎందుకంటే ఆమె చాలా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడు పూర్తిగా ఆ వ్యాధి నుండి బయటపడుతోంది కాబట్టి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే వేణు స్వామి చెప్పిన ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అంటూ నేటిజన్స్ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వేణు స్వామి చెప్పినట్లు ఇప్పటివరకు అన్ని నిజమయ్యాయి. ఇప్పుడు ఈ విషయం కూడా నిజమైతే ఇక వేణు స్వామి చెప్పే మాటలకు తిరిగే లేదు అంటూ నేటిజన్స్ భావిస్తున్నారు.