బిగ్ బాస్ సీజన్ -7 లో రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈమె తన అందంతో తన డాన్స్ తో బిగ్ బాస్ షోలో అలరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..ఈమె అసలు పేరు ప్రియా.. ఈమె మోడలింగ్ చేసింది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో స్టాండప్ కమెడియన్ గా చేసింది. ఆ తరువాత మోడలింగ్ చేస్తూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది..
అయితే రతికనే తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పింది.. ఇంతకు ఆమె లవర్ ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు. అయితే రతిక లవర్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున నీ లవర్ గురించి చెప్పు అని అడగ్గా ఇప్పుడు పాట పాడాలా అంటూ షాక్ ఇచ్చింది.. అంటే తన లవర్ సింగర్ అని అర్థం అయింది. నాగార్జున రతికను నువ్వు ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడగ్గా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది.
అవును నా పేరెంట్స్ ని తరువాత అతడినే అని తెలిపింది. బిగ్ బాస్ మీరు చాలా పాటలు వినిపించారు నీకోసం ఓ పాట నేను వినిపిస్తాను అని అన్నారు.. ఇంతలో ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి పిల్లా.. పిల్లా భూలోకం దాదాపు కన్నుమూయు వేల అనే సాంగ్ ప్లే చేశారు. ఈ పాటని రాహుల్ సిప్లగంజ్ గతంలో బిగ్ బాస్ హౌస్ లో పాడి అలరించాడు
అంటే అప్పుడు రతిక బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లగంజ్ అని అందరికీ అర్థమయింది. అందరూ రాహుల్, రతీక లవరా అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమాలో సాంగ్స్ పాడకముందు రాహుల్ ప్రవేట్ ఆల్బమ్ చూశారు. ఆ సమయంలో రతికాతో పరిచయం ఏర్పడిందని అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కూడా చేరిపోయాయి.