సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది హీరోయిన్స్ తన కెరీర్ గురించి ముందుకు సాగాలని ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు… మొదట్లోనే కొంతమంది మాత్రం అవకాశాలు కల్పిస్తూనే వారితో కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు. తమ కోరికలను తీరిస్తేనే మీకు కెరీర్ ఉంటుంది అంటూ కొందరు లేడీస్ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేసినటువంటి సంఘటనలు మనం ఎన్నో వింటూనే ఉన్నాం ..అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు బహిరంగంగా కూడా వెల్లడించారు.
ఇది కాస్త పక్కన పెడితే తాజాగా సింగర్ ప్రణవి కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈమె తన భర్త రఘు మాస్టర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవి తన కెరీర్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేసింది. ఈ సందర్భంలో ప్రణవి మాట్లాడుతూ ఓ డైరెక్టర్ తన గొంతు బాగుందని చెప్పి ఓ సినిమాలో పాట పాడటానికి పిలిచారు. అయితే అతనిని కలిసిన తరువాత తనకు ఈ సినిమాలో పాటలు పాడే అవకాశం రావాలి అంటే ఒకరోజు రాత్రి తనతో ఉండాలని ఉద్దేశంతోనే మాట్లాడారని ఆమె తెలియచేసింది.
ఇలా ఆ వ్యక్తి అడగడంతో నాకు చాలా కోపం వచ్చి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే చెప్పు తెగుతుంది అంటూ తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చేసాను ఇలా తనకు ఎదురైనా చేదు జ్ఞాపకాలను ప్రణవి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు.. అనుకుంటే సింగర్స్ కూడా ఇలాంటి అనుభవాలను అనుభవించి ఉంటారా అని చాలామంది అనుకోవచ్చు.. కానీ ఎటు చూసినా ఇలాంటి క్యాస్టింగ్ కౌచులే జరుగుతాయి. ప్రస్తుతం సింగర్ ప్రణవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.