తెలుగు సినీ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్క శెట్టి.. ఆ తరువాత అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత ప్రభాస్ తో బాహుబలి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రను వేసుకుంది. చివరిగా నిశ్శబ్దం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే కరోనా టైం లో కాబట్టి ఆ సినిమా ఓటిటిలోనే విడుదలయ్యింది.
అయితే అనుష్క చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మిస్ శెట్టి -మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మళ్లీ రియంట్రి ఇవ్వబోతోంది..ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న రేపటి రోజున ఈ సినిమా విడుదల కానుంది.. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర బృందం ..ఇక నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండగా అనుష్క కూడా ఇందులో భాగమయ్యింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ ను చేసింది.. ఈ బ్యూటీ తాను పెళ్ళికి వ్యతిరేకం కాదని… సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలియజేసింది. అయితే ఇప్పటివరకు తాను పోషించిన అరుంధతి, భాగమతి ,దేవసేన ప్రత్యేకమైన పాత్రల్లో కంటే ఈ సినిమాలో అన్విత పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని ఇలాంటి రోల్ రావాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి.
ఇక పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ శ్రీదేవి లాంటివారు ఎన్నో ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమాల్లో నటించారని.. మంచి కథకు సరిహద్దులు ఉండవని… అలాగే తన పెళ్లిపై స్పందిస్తూ వివాహ వ్యవస్థ పై తనకు నమ్మకం ఉందని పెళ్ళికి తాను ఎప్పుడు వ్యతిరేకం కాదని అన్నారు.. అనుష్క సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలియజేశారు.