ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకుంది. స్నేహ కమర్షియల్ చిత్రాలనే కాకుండా ఓల్డేజ్ వాళ్ళని కూడా ఆకట్టుకుంది.. అది ఎలా అంటే భక్తి రస చిత్రాలలో కూడా ఆమె నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది.
స్నేహ కు వివాహమైన సంగతి మనకు తెలిసిందే.. పెళ్లి తర్వాత స్నేహ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందనే చెప్ప వచ్చు ..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ లో అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సైడ్ క్యారెక్టర్లో నటించింది.. ఆ తరువాత కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ లను చేస్తూ ఇప్పటికీ కూడా అలరిస్తోంది. స్నేహ తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా చిత్రాలలో నటించి మెప్పిస్తోందట. ఇది కాస్త పక్కన పెడితే స్నేహ ఒక భారీ ఆఫర్ను అందుకుందనే వార్తలు కోలీవుడ్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి.
అయితే స్నేహ దాదాపు 24 ఏళ్ల తరువాత ఆ హీరోతో నటిస్తోందట. ఇంతకు ఆ హీరో ఎవరనుకున్నారు ఆయనే దళపతి విజయ్.. ప్రస్తుతం విజయ్ దళపతి లియో అనే సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే..ఈ సినిమాకి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.విక్రమ్ లాంటి సినిమా తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా చివరి దశకు వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తోంది. ఇందులో స్నేహ విజయ్ దళపతి తండ్రి భార్యగా నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి..మరి చూడాలి ఈ సినిమాలో స్నేహ ఎలాంటి పాత్రను పోషిస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.