టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం తర్వాత కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఆలీ కూడా ఒకరు.. ఆలీ బాల నటుడి గానే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. అంతేకాకుండా చిన్నతనం నుంచే ఎన్నో సినిమాలలో నటించి అప్పుడే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.. ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటూ కమిడియన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.
ఇప్పటికీ కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.. ఎన్నో అవార్డులను అందుకున్నటువంటి ఆలీ తన కెరీర్లో కొందరు నిర్మాతలు తనని చాలా చులకనగా చూసేవారట. ఈయనని సినిమాలలో తీసుకొని అనంతరం రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది..ముఖ్యంగా ఓ బడా నిర్మాత తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని మొత్తం పూర్తి చేయించుకుని తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా చేశారు..
మన ఆలీకె కదా ఏముంది లేండి ఒక బిర్యాని ప్యాకెట్ ఇచ్చి పంపించేయండి అంటూ మాట్లాడేవాడట.. ఇలా ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం ఆలి సినిమాలు చేశారని ఈయన స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. ఇలా బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నటువంటి ఆలీ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయి సమయం వచ్చినప్పుడు నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చారని తెలుస్తోంది.
ఎప్పుడైనా ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆయన షూటింగ్ కి డుమ్మా కొట్టేవాడట.. అదేంటి అని నిర్మాతలు ప్రశ్నిస్తే మీరు ఇచ్చిన బిరియాని తిని పడుకున్నానండి అందుకే రాలేకపోయాను అంటూ పరోక్షకంగా వారిని ఎత్తగొట్టేవాడట. రాను రాను ఆలీ అంచలంచలుగా ఎదుగుతూ రెమ్యూనేషన్ పరంగా కూడా మంచిగానే పుచ్చుకుంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా వెలుగుతున్నాడు. ఇప్పుడైతే కాస్త సినిమా అవకాశాలు తగ్గిన బుల్లితెరపై పలుషోలలో ప్రేక్షకుల ముందుకు హాజరవుతూ ఉంటారు ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు అలీ.