నిర్మాతకి షాక్ ఇచ్చిన జీ ఛానెల్

Google+ Pinterest LinkedIn Tumblr +

హిట్ సినిమా అంటే శాటిలైట్ రేటుకి రెక్కలొస్తాయి. అయితే ఈమధ్య రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అందుకున్న గీతా గోవిందం సినిమా మాత్రం శాటిలైట్ విషయంలో పెద్ద పొరపాటు జరిగింది. సినిమా శాటిలైట్ బిఫోర్ రిలీజ్ అమ్మడంతో కేవలం కోటిన్నరకే జీ తెలుగు గీతా గోవిందం సినిమాను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రేంజ్ కు కనీసం 10 కోట్లు అయినా శాటిలైట్ అయ్యేది.

అయితే అల్లు అరవింద్ లెక్క ఎప్పుడు తప్పడు గీతా గోవిందంతో పాటుగా విజయ్ తర్వాత రిలీజ్ అవుతున్న టాక్సీవాలా మూవీ శాటిలైట్ కు ముడి పెట్టాడట. ఆ కమిట్మెంట్ ఏంటన్నది తెలియదు కాని గీతా గోవిందంతో టాక్సీవాలాని సేఫ్ చేశాడట అల్లు అరవింద్. ఏది ఏమైనా జీ తెలుగు మాత్రం పెద్ద హీరోల సినిమాలు భారీ రేటుకి కొని లాసులవుతుంటే ఎలాంటి అంచనాలు లేని గీతా గోవిందంతో మాత్రం మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.

Share.