తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ జూనియర్లు అనే ఒక వివక్షత తప్పకుండా ఉంటుంది. అందుకేనేమో అలాంటివన్నీ ఎదురుకున్న తర్వాతే వాళ్లు గొప్ప ప్రయోజకులు అవుతారు. ముఖ్యంగా ఇలాంటివన్నీ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికీ కూడా ఆయన కామెడీ సీన్స్ వస్తే కడుపుబ్బ నవ్వుకొనే నటుడు ఎం ఎస్ నారాయణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..
ఈయన మొదటిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు కమెడియన్ కావాలని అనుకోలేదట. ఒక రైటర్ కావాలని అనుకున్నాడట. రైటర్ గా కూడా కొన్ని స్టోరీలను రాశాడట. కానీ సీనియర్ రైటర్లు తనని ఎగతాళి చేస్తూ కొన్ని మాటలు అనేవారట దాంతో ఆయన అప్పటికప్పుడే ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోదామనుకున్నాడట.. కానీ మనం వచ్చిన పని ఏంటి ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవటం ఏంటి అంటూ ఆయనకు ఆయనే సర్ది చెప్పుకొని రైటర్ గా చిన్న చిన్న సినిమాలకు రాశాడట.
ఇక ఆ టైంలోనే ఇ,వి,వి సత్యనారాయణ చూసి ఎం.ఎస్ నారాయణ కమెడియన్ గా మార్చడం జరిగిందట. ఇక ఈయన తాగుబోతు క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించేవాడు. ఆ క్యారెక్టర్ తోనే ఈయనకి ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఈయన నటించిన సినిమాలో ఆ క్యారెక్టర్ ని చూస్తానే ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ఎమ్మెస్ నారాయణ కెరీర్లో పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాల్లో కమెడియన్ గా నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా అప్పట్లో ఉన్న హీరోలందరి సినిమాలలో ఈయనే కమెడియన్ గా నటించారు. ఎమ్మెస్ నారాయణ చేసేది చిన్న పాత్ర అయినప్పటికీ ఆయనకి మాత్రం ఒక మెట్టు ఎక్కేలా చేసింది. ఇక ఇప్పటికీ కూడా ఆయన చేసిన సినిమాలలో పాత్రలను చూస్తుంటే చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉంటాయని చెప్పవచ్చు.