బిగ్ బాస్ లోకి వెళ్లడం పై క్లారిటీ ఇచ్చిన యాక్టర్ సురేఖ వాణి…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ షో కి ఏ స్థాయిలో ఆదరణ ఉందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఉన్నది.. ఈ షో ఇప్పటివరకు అన్ని భాషలలోనూ ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ తెలుగులో6 సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్-7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ షో గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood: Surekha Vani's daughter set to debut as heroine

ఈ సీజన్ -7 సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున వెల్లడించారు. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ -7 సీజన్లో పాల్గొనబోయే కంటిస్టెంట్ వీళ్లే అంటు ఎన్నో రకాల లిస్ట్ కూడా వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ జాబితాలో వెండితెర క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, తన కూతురు సుప్రీత కూడా ఉన్నారంటూ ఒక వార్త వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో అయితే ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ ఎలా ఉంటుందో మనమందరం చూసాం.. అలాంటిది బిగ్ బాస్ కి వెళ్తే వేరే లెవెల్ లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇలా వీళ్ళిద్దరూ ఈ షోలో కనిపిస్తున్నారు అంటూ వస్తున్న వార్తలపై వీళ్లు స్పందించారు.

ఈ సందర్భంగా సురేఖా వాణి మాట్లాడుతూ మేము బిగ్ బాస్ లోకి వెళ్తున్నామని వార్తలు వినిపిస్తున్నాయి అవి ఏవి నిజం కాదు గతంలో ఇలాంటి వార్తలు చాలానే వినిపించాయి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తాము నెగిటివిటీ మూటకట్టుకోలేమని అందుకే తాము బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లలేదని తమ గురించి వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సురేఖ వాణి తెలిపింది.

Share.