ప్రముఖ లేడీ కమెడియన్ , క్యారెక్టర్ ఆర్టిస్టు ఊర్వశి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మ పాత్రలకు పెట్టింది పేరు ఈమె. తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె తన అందచందాలతో ప్రతి ఒక్కరిని కూడా అలరించింది. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసిన ఊర్వశి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగు, తమిళ్ , కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా 700 పైగా చిత్రాలలో నటించింది.
కెరియర్ పీక్స్ లో ఉండగానే 2000 వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె జయన్ ను పెళ్లి చేసుకోగా.. వీరికి తేజ లక్ష్మి అనే అమ్మాయి కూడా జన్మించింది. కొంతకాలం తర్వాత దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు రావడంతో విడాకులు తీసుకున్నారు ఈ జంట. అయితే తాజాగా విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది ఊర్వశి.. ఆమె మాట్లాడుతూ.. మనోజ్ నేను విడిపోవడానికి కారణం తాగుడు కి అలవాటు కావడమే. వాళ్ళింట్లో అందరూ కూడా ప్రతిరోజు ఒకే దగ్గర కూర్చొని కలిసి మందు తాగుతారు. అలా నన్ను కూడా బలవంతం చేశారు.
అలా వారితోపాటు ప్రతిరోజు కూర్చొని తాగడం వల్ల మత్తుకు అలవాటు పడిపోయి.. పూర్తిగా బానిసను అయిపోయాను. ఇక అందుకే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా మొదలయ్యాయి . ఇక నేను మత్తుకు బానిసయ్యాన్ని తెలుసుకొని పాపకి కూడా నన్ను దూరం చేశారు. అలా ఒంటరిదాన్ని అయిపోయి జీవితాన్ని కోల్పోయాను. ఆ తర్వాత కొంత కాలానికి 40 ఏళ్ల వయసులో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా శివప్రసాద్ ను పెళ్లి చేసుకోగా ఇషాన్ ప్రజాపతి అనే కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం వీరితో సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది ఊర్వశి.